News February 25, 2026

‘శతరూప’ గురించి మీకు తెలుసా?

image

బ్రహ్మ మానవ సృష్టి కోసం మనస్సు నుంచి మొదటి స్త్రీ ‘శతరూప’ను సృష్టించారు. శతరూప అంటే ‘వంద రూపాలు గలది’ అని అర్థం. బ్రహ్మ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అన్ని దిశల నుంచి చూడటానికి 5 తలలు పొందారట. అయితే సృష్టి క్రమాన్ని కాపాడటానికి శివుడు బ్రహ్మ ఐదవ తలను వేరుచేశాడు. వీరిద్దరూ నైమిశారణ్యంలో తపస్సు చేసి మానవాళికి జీవం పోశారని పురాణాల వాక్కు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో వీరిద్దరి అరుదైన ఆలయం ఉంది.

Similar News

News March 1, 2026

సెంట్రల్ ఎలక్ట్రో‌కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 4 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BTech/MTech(కెమికల్ ఇంజినీరింగ్), PhD(ఫిజికల్/కెమికల్ సైన్సెస్), BSc(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులు అర్హులు. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు. మార్చి 6న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: www.cecri.res.in/

News March 1, 2026

ఒంటి కన్ను కుబేరుడి కథ మీకు తెలుసా?

image

కుబేరుడు ఓసారి కైలాసంలో పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవ్వగా ఆమె కోపంతో ఆయన ఎడమకన్ను కాలిపోయింది. తన తప్పు తెలుసుకున్న కుబేరుడు 800 ఏళ్లపాటు కఠినమైన ‘రౌద్ర కేదార వ్రతం’ చేసి శివుడిని మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై కుబేరుడిని తన స్నేహితుడిగా స్వీకరించాడు. కాలిపోయిన కన్ను స్థానంలో ఓ గవ్వను అమర్చాడు. ఒకే కన్ను, పింగళ వర్ణంలో ఉండటం వల్ల ఆయనను ‘ఏకాక్ష పింగళుడు’ అని పిలుస్తారు.

News March 1, 2026

మిడిల్ ఈస్ట్ దేశాలు.. వాటి ప్రాముఖ్యం ఇదే!

image

మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియా, Iran, ఈజిప్ట్, తుర్కియే, Iraq, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, లెబనాన్, Yemen, ఒమన్, UAE, కువైట్, బహ్రెయిన్, ఖతర్, పాలస్తీనా, సైప్రస్ దేశాలున్నాయి. ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాల జన్మస్థలాలు, పురాతన నాగరికతలు (మెసొపొటేమియా, ఈజిప్టు) ఇక్కడే పుట్టాయి. ప్రపంచంలోని ఆయిల్&నేచురల్ గ్యాస్‌ నిల్వలలో అతిపెద్ద భాగం(48-50%) ఇక్కడే ఉన్నాయి. అలాగే వాణిజ్య గేట్‌వేగా పిలువబడుతున్నాయి.