News February 25, 2026
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News February 27, 2026
భూపాలపల్లి: డీపీవో కార్యాలయంలో అతడే ‘కీ’రోల్..?

జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలొ జిల్లా ఏర్పడ్డ నుంచి అతడిదే హవా నడుస్తోంది. ఎంపీవోగా ప్రమోషన్ వచ్చిన వెళ్లకుండా అక్కడే తిష్ట వేసుకొని ఉండటంలో మర్మం ఏంటో అంతు చిక్కడం లేదు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి వెనక ఎవరిదైన హస్తం ఉందా..? గ్రామ పంచాయతీ డిజిటల్ ‘కీ’ విషయంలో ముడుపులు ముట్టందే ‘కీ’ ముట్టదనే వాదనలున్నాయి.
News February 27, 2026
మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 27, 2026
సెమీస్‌పై కివీస్ కన్ను

T20 WCలో ఇవాళ సా.7 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గ్రూప్-2 నుంచి ENG ఇప్పటికే సెమీస్ చేరగా రెండో బెర్త్ ఖాయం చేసుకోవాలని శాంట్నర్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే కివీస్ నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఓడితే రేపటి శ్రీలంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. లంకపై పాక్ భారీ తేడాతో గెలిస్తే కివీస్ సెమీస్ ఆశలు క్లిష్టమవుతాయి.


