News February 25, 2026

కలెక్టర్ చేతులమీదుగా అక్రిడేషన్ విడుదల

image

2026 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం పంపిణీ చేశారు. పలువురు జర్నలిస్టులు కలెక్టర్ నుంచి అక్రిడేషన్ కార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

సిరిసిల్ల: అదనపు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు

image

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో తొలి రోజు నుంచి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గరీమా అగ్రవాల్ ఇదే జిల్లాకు కలెక్టర్ కావడం విశేషం. 2025 అక్టోబర్ 23న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆమె.. అప్పటి కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లడంతో 4 నెలలుగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమితులయ్యారు.

News February 26, 2026

మన్యం: 3 రోజుల క్రితమే వచ్చి అంతలోనే మృత్యవాత.. జవాన్ వివరాలివే

image

జియ్యమ్మవలస(M) శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దవలసింగి చంద్రమౌళి(29) గిజబ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామస్థుల వివరాలు మేరకు మృతుడు.. గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం వివాహమైందని భార్య, సంవత్సరం వయస్సున్న పాప ఉన్నారన్నారు.

News February 26, 2026

శ్రీశైలంలో అగ్నిప్రమాదాలు.. ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఎక్కడ?

image

శ్రీశైల దేవస్థానం పరిధిలోని కాటేజీలు, నిత్య అన్నదాన సత్రాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతనెల 21న, నేడు జరిగిన అగ్నిప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఫైర్ ఎక్విప్‌మెంట్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గించవచ్చని భక్తులు చెబుతున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, సత్రాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.