News February 25, 2026
WNP: క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాలు

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31న వనపర్తిలోని బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరుకావాలన్నారు. మండల స్థాయి ఎంపికలకు వెళ్లే బాల బాలికలు మొదటగా tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో
రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25
News February 28, 2026
గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలి: అడ్లూరి

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్ర పరంగా అభివృద్ధి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గత పుష్కరాలకు భిన్నంగా అభివృద్ధి పనులు చేయాలని, వెహికల్ పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కనురెప్పపాటు కరెంటు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు.
News February 28, 2026
వేట్లపాలెం ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మృత్యువాత పడటం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


