News February 25, 2026
నాగర్‌కర్నూల్: క్రీడా పాఠశాల 4వ తరగతి ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వి.సీతారాం తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు గడువు నిర్ణయించారు. హకీంపేట్ క్రీడా పాఠశాలలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశం కల్పిస్తామని, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు.
Similar News
News March 7, 2026
MHBD: అక్రమ ఇసుక రవాణా సమన్వయంతో అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక రవాణాను అన్ని శాఖలు సమన్వయంతో అరికట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఇసుక అక్రమ రవాణా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక సరఫరా తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక సరఫరా చేయాలన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటమన్నారు.
News March 7, 2026
MHBD: సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర: అదనపు కలెక్టర్

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మహబూబాబాద్ TGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సమాజంలో ముందంజలో నిలుస్తున్నారని టీజీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ అన్నారు.
News March 7, 2026
HYD: 2026-27 నుంచి NEP 2020 అమలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి CPGET ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.


