News February 25, 2026
నిర్మల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం

జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై పీసీ, పీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనధికార ఆర్‌ఎంపీలను గుర్తించి, ప్రథమ చికిత్సకు మించి చికిత్సలు చేయకుండా నియంత్రించాలని సూచించారు.
Similar News
News March 1, 2026
జగిత్యాల: ఆర్ఎస్ఎస్ మహాసాంఘిక్ కార్యక్రమం

వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థ ప్రముఖ్ గంట తిరుమల్ జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, శక్తివంతమైన భారతదేశంతోనే ప్రపంచశాంతి సాధ్యమని పేర్కొన్నారు.
News March 1, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News March 1, 2026
HNK: మావోయిస్టు లొంగుబాటు

జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన లొంగుబాటుతో స్థానికంగా హర్షాతిరేకాలు వెలువెత్తాయి.


