News February 25, 2026

పాలమూరు: టెన్త్ విద్యార్థులు ALERT.. 5Mit సడలింపు

image

ఈ ఎడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం 5 నిమిషాల సడలింపును ఇచ్చిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఐదు నిమిషాల సడలింపు అనంతరం పరీక్షకు హాజరయ్యే వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించరని, పరీక్షలు జరిగే రోజున చుట్టుపక్కల ఉండే జిరాక్స్ కేంద్రాలు అన్ని మూసివేయాలని, ఆయా శాఖల అధికారులు పరీక్ష కేంద్రాలను ముందే సందర్శించి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 7, 2026

అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.

News March 7, 2026

9న చిత్తూరు DRC సమావేశం

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఈనెల 9న ఉదయం 11 గంటలకు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం(డీఆర్సీ) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు వేసవి దృష్ట్యా తాగునీటి వసతి కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ(పీజీఆర్ఎస్, రీసర్వే), వ్యవసాయ, ఉద్యానశాఖ, విద్య, వైద్యఆరోగ్య శాఖ అంశాలపై చర్చించనున్నారు.

News March 7, 2026

KMR: రేపటి నుంచే HPV వ్యాక్సినేషన్: DM&HO

image

కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం HPV టీకా కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్ఓ డా.రవీందర్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కామారెడ్డి, ప్రాంతీయ ఆస్పత్రి బాన్సువాడలలో మొదటగా ప్రారంభిస్తామన్నారు. HPV శాస్త్రీయమైన, సురక్షితమైనదని అన్నారు. కుటుంబ సంరక్షకులకు ఆరోగ్య కేంద్రాలకు రావాలన్నారు.