News May 3, 2024

కాలువలో పురిటి బిడ్డ మృతదేహం

image

తిరుపతిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. నగరంలోని తిరుమల నగర్, కృష్ణవేణి యాదవ్ కాలనీ డ్రైనేజీలో ఓ పురిటి బిడ్డ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో పడేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News March 23, 2026

ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించినట్లు డీఐఈఓ రఘుపతి తెలిపారు. పేపర్ కరెక్షన్ పారదర్శకంగా జరుగుతోందన్నారు. అధికారులకు నిబంధనలు వివరించామన్నారు. జిల్లాకు 1,67,700 జవాబు పత్రాలను దిద్దేందుకు ఏఈలు 480 మంది, సీఈలు 60, పరిశీలకులు 160 మంది, ఏసీఈలు 15 మందిని నియమించినట్లు తెలియజేశారు. మూల్యాంకనం 20 రోజుల్లో ముగుస్తుందని ఆయన తెలిపారు.

చిత్తూరు: నిద్రమత్తు, వేగమే కారణమా.?

image

ఈ హైవేపై ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దూర ప్రయాణాల కారణంగా డ్రైవర్ల అలసట, <<19452617>>నిద్రమత్తు<<>>లో వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోవడమే కారణంగా తెలుస్తోంది. అతివేగం మరోకారణంగా తెలుస్తోంది. గ్రామాల సమీపంలో వేగ నియంత్రణ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. పలు బ్లైండ్ స్పాట్ల వద్దే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.