News February 25, 2026

డయిల్‌ 100కు తక్షణమే స్పందించాలి: భద్రాద్రి ఎస్పీ

image

=బాధితుల నుంచి ‘డయిల్‌ 100’కు ఫోన్‌ రాగానే పోలీసులు తక్షణమే స్పందించి వారికి అండగా నిలవాలని ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశించారు. బుధవారం పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులోనూ ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌’ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

Similar News

News February 28, 2026

MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 28, 2026

ఇరాన్‌తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

image

మిడిల్ ఈస్ట్‌లోని సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతిస్తున్నాయి. ఇక వెస్ట్రర్న్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తీవ్రంగా తప్పుబడుతూ US వైపు నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరుదేశాలకు మద్దతుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 28, 2026

కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందికై లేఖ: SP

image

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో విధులు నిర్వర్తించేందుకు కన్నడ భాష తెలిసిన పోలీస్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు SP సునీల్ షోరాణ్ వెల్లడించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్చలు జరిపామని, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.