News May 3, 2024
మొగులయ్యకు అండగా ఉంటా: కేటీఆర్

TG: పద్మశ్రీ అవార్డు గ్రహీత, <<13171008>>ప్రముఖ<<>> జానపద కళాకారుడు మొగులయ్య రోజువారీ కూలీగా మారడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మొగులయ్యకు తాను అండగా నిలుస్తానని ట్వీట్ చేశారు. ‘ఆయన కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా ఆదుకుంటా. నా ఆఫీస్ సిబ్బంది వెంటనే మొగులయ్య వద్దకు వెళ్తారు’ అని కేటీఆర్ తెలిపారు.
Similar News
News January 11, 2026
చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 11, 2026
పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే..?

దేవుని ప్రసాదంగా పొందిన పసుపును పూజా గదిలో ఉంచి నిత్యం పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మరోగాలు తొలగి దేహకాంతి పెరుగుతుంది. ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వివాహ దోషాలు ఉన్నవారు పసుపు గౌరీని పూజించాలి. వ్యాపార స్థలాల్లో పసుపు నీరు వాడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే పసుపు దానం చేయడం శ్రేయస్కరం. ఫలితంగా ఇంట్లో దైవకళ ఉట్టిపడి, సకల శుభాలు కలుగుతాయి.
News January 11, 2026
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/రిఫ్రిజిరేషన్)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.becil.com


