News February 25, 2026

భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

image

భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 9,685మంది విద్యార్థులకు గాను 9,210 మంది (95.09%) హాజరైనట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జనరల్ విభాగంలో 7,973 మందికి 7,683 మంది, వొకేషనల్ విభాగంలో 1,712 మందికి 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News March 9, 2026

ములుగు: ‘ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోండి’

image

ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కోగిల మహేశ్ జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌కు ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై చర్యలు తీసుకొని, మెమోలు జారీ చేయాలని, ప్రజలకు సమయానికి సేవలు అందేలా చూడాలని కోరారు.

News March 9, 2026

ఇరాన్ కొత్త సుప్రీం.. US, ఇజ్రాయెల్‌కు చైనా వార్నింగ్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నియామకంపై చైనా, రష్యా స్పందించాయి. ఈ నియామకాన్ని ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్‌గా పేర్కొన్న చైనా కొత్త లీడర్‌ను లక్ష్యంగా చేసుకోవద్దని US, ఇజ్రాయెల్‌లను హెచ్చరించింది. మరోవైపు మొజ్తబాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో ఇరాన్‌కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇరాన్ ప్రజల సపోర్ట్‌తో తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నామన్నారు.

News March 9, 2026

అనకాపల్లి జిల్లాలో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష

image

ఇద్దరు గంజాయి నిందితులకు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. నిందితులు వి.జయరాం, జి.భీమరాజు 2016 సెప్టెంబర్ నెలలో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ గౌరీ పట్నం వద్ద పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.