News February 25, 2026
జగిత్యాల: ‘భూభారతి దరఖాస్తులు జాగ్రత్తగా చేయాలి’

జగిత్యాల జిల్లాలోని మీసేవ నిర్వహకులకు కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. సమస్యలకు తగిన దరఖాస్తులు నింపి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మీసేవ నిర్వహకులపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 28, 2026
పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే..

ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్‌ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.
News February 28, 2026
ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు: JD వాన్స్

ఇరాన్‌పై ఒకవేళ సైనిక దాడులు చేసినా అది సుదీర్ఘ యుద్ధానికి దారితీసే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు దేశంగా మారకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం సైనిక, దౌత్యపరమైన వ్యూహాలను పరిశీలిస్తోందని తెలిపారు. గతంలో ఇరాక్ యుద్ధం వంటి తప్పులు మళ్లీ జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చర్చల ద్వారానే పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
News February 28, 2026
పనీర్ vs సోయా చంక్స్: ప్రొటీన్ లెక్కల్లో ట్విస్ట్

పనీర్ కంటే సోయా చంక్స్‌లోనే ప్రొటీన్ ఎక్కువ. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రొటీన్ ఉంటే సోయాలో 52 గ్రాములు ఉంటుంది. కానీ, మనం ఒకేసారి 100 గ్రాముల పనీర్ తినగలం. అదే సోయా చంక్స్ ఉడికాక అంత మొత్తంలో తినడం కష్టం. సాధారణంగా మనం తినగలిగే 20 గ్రాముల సోయా ద్వారా 10 గ్రాముల ప్రొటీనే అందుతుంది. కాబట్టి ప్రొటీన్ డెన్సిటీలో సోయా బెటర్ అయినా.. శరీరానికి అందే పోషకాల పరంగా మాత్రం పనీర్ బెస్ట్ ఛాయిస్.


