News February 25, 2026
రేపటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: సాలకట్ల తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబైంది. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రేపు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నట్లు TTD అధికారులు తెలిపారు. మార్చి 2 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ సహా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.
Similar News
News February 28, 2026
మదీనా బస్సు ప్రమాద బాధితులకు ₹5L చొప్పున పరిహారం

TG: గత ఏడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన <<18312045>>బస్సు ప్రమాదంలో<<>> 44 మంది HYD వాసులు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు CM రేవంత్ ఈరోజు సచివాలయంలో ₹5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. గాయపడిన ఒకరికి ₹3లక్షలు ఇచ్చారు. ‘దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సాయం ప్రకటించాం’ అని సీఎం తెలిపారు.
News February 28, 2026
సర్వాంగ సుందరంగా అమరావతి రివర్ ఫ్రంట్

AP: అమరావతిని ఆనుకొని 27 KM మేర ప్రవహించే కృష్ణా రివర్ ఫ్రంట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు GOVT ఏర్పాట్లు చేస్తోంది. వాకింగ్ ట్రాకులు, పార్కులు, రివర్ మార్కెట్లు, థీమ్ పార్కులు, మ్యూజియమ్‌లు ఏర్పాటుచేయనుంది. ఫిట్‌నెస్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, పబ్లిక్ ప్లాజాలు, ఓపెన్ థియేటర్లు, బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే ఘాట్‌లు నెలకొల్పనుంది. పర్యాటక ప్రాంతంగా ఇది ఉపాధి కల్పిస్తుందని భావిస్తోంది.
News February 28, 2026
కీరదోసలో బూడిద తెగులును ఎలా నివారించాలి?

కీరదోసలో బూడిద తెగులు ఆశిస్తే ఆకుల ఉపరితలంపై, కాడలపై తెల్లటి బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. ఇది ఆకు మొత్తం కప్పేసి చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి కాండంతో సహా ఎండిపోతాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి థయోఫనేట్ మిథైల్ (75% WG) 2.5 గ్రా. లేదా బినామిల్ 50% WP 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


