News February 26, 2026

మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

image

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 28, 2026

మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.

News February 28, 2026

మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

image

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.

News February 28, 2026

MDK: శాంతి భద్రతల భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. చట్టవ్యతిరేక చర్యలు, ఆస్తి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.