News May 3, 2024
కాంగ్రెస్ MP అభ్యర్థిపై కేసు నమోదు

TG: కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 11, 2026
చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.
News March 11, 2026
భర్తతో విడాకులు.. భరణం ఆశించని హన్సిక

ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా భర్త సోహైల్ నుంచి <<19354762>>డివోర్స్<<>> తీసుకున్న హీరోయిన్ హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు. మనస్పర్ధల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
News March 11, 2026
నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.


