News May 3, 2024
గెలవలేకే గాంధీలు పోటీకి రాలేదు: స్మృతి ఇరానీ

అమేథీలో పోటీ చేసి గెలిచే ధైర్యం లేకనే గాంధీల కుటుంబం అక్కడ బరిలో దిగలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబం నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు. అంటే ఎన్నికలు జరగకముందే వారు తమ ఓటమిని అంగీకరించారు’ అని స్పష్టం చేశారు. చివరిగా రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీ సీటును కాంగ్రెస్ ఈరోజు కేఎల్ శర్మకు కేటాయించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 5, 2025
ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించవచ్చా?

దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే దీపాన్ని మరో దీపంతో వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోనే తిరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇలా చేస్తే మొదటి దీపం ఆకర్షించిన ప్రతికూలత రెండవ దీపానికి చేరుతుంది. దీనివల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా మీ చుట్టూర వ్యాపిస్తుంది. ఇలా జరగకూడదన్నా, అశుభ సంఘటనల నుంచి బయటపడలన్నా ఈ తప్పు చేయకూడదు’ అని సూచిస్తున్నారు.
News November 5, 2025
‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.


