News May 3, 2024
2 కోట్ల ఖాతాలను నిషేధించిన వాట్సాప్!

ఈ ఏడాది తొలి 3 నెలల్లో భారత్‌లో 2.2 కోట్ల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గత ఏడాది ఇదే కాలానితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వాట్సాప్ నెలవారీ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత చట్టాలను అతిక్రమించిన ఖాతాలు, గ్రీవెన్స్ కమిటీ సూచించినవి, వినియోగదారులు ఫిర్యాదు చేసినవి వీటిలో ఉన్నాయని తెలిపింది. తమ మార్గదర్శకాలకు, దేశ చట్టాలకు లోబడి ఉండని ఖాతాలను ఇలాగే తొలగిస్తామని స్పష్టం చేసింది.
Similar News
News February 3, 2026
BRIC THSTIలో ఉద్యోగాలు

BRIC THSTI 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD(లైఫ్ సైన్సెస్, ఇమ్యునాలజీ, వైరాలజీ, వెటర్నరీ సైన్సెస్), MSc, MVSc, MTech, M.Pharmacy, MD/MDS/MPH, MBBS/BDS, DMLT, డిగ్రీ, ఇంటర్/ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thsti.res.in
News February 3, 2026
భారత్‌కు లభించిన బెస్ట్ డీల్ ఇది: పీయూష్

ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే అమెరికాతో భారత్ చేసుకున్న డీల్ ఉత్తమమైనదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ డీల్ నుంచి డెయిరీ, వ్యవసాయ రంగాలకు రక్షణ కల్పించినట్లు స్పష్టం చేశారు. లెదర్, జెమ్స్, ఇంజినీరింగ్ వంటి ప్రధాన ఎగుమతి రంగాలతో పాటు MSMEలకు ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ డీల్ వల్ల అందరికీ లబ్ధి చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News February 3, 2026
ఆయిల్ కొనడం ఆపేస్తున్నట్లు ఇండియా మాకు చెప్పలేదు: రష్యా

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై మాస్కో స్పందించింది. దీనిపై తమకు IND నుంచి ఎలాంటి సమాచారం రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. US-ఇండియా సంబంధాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రష్యా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం తమకు అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. టారిఫ్స్ తగ్గింపునకు బదులుగా ఇండియా తమ నుంచి ఆయిల్ కొంటుందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.


