News May 3, 2024

ఇంటి వద్దే పెన్షన్లు అందించాలి.. CSకు చంద్రబాబు లేఖ

image

AP: ఎన్నికల పోలింగ్‌కు ముందు పింఛన్‌‌దారులను వేధించడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించొద్దని ఆయనకు సూచించారు. గత నెలలో 35 మంది, ఇప్పుడు ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారన్నారు. ఈ మారణ హోమంలో ఏ1 జగన్, ఏ2 సీఎస్ అని ఆరోపించారు.

Similar News

News March 31, 2026

పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ₹247Cr విడుదల

image

TG: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹247.94 కోట్ల నిర్దిష్ట నిబంధనలు లేని నిధులను (Untied Grants) విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.

రీల్స్ చేస్తూ బాలిక మృతి

image

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్‌కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.