News May 3, 2024

భూములు దోచేసే చట్టం తెచ్చారు: పవన్

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఠా కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరిక అని అన్నారు. ‘112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నం.1 తెచ్చారు. భూములు దోచేసే చట్టాన్ని అసెంబ్లీలో చర్చ లేకుండానే తెచ్చారు. మన ఆస్తి మనదని 90 రోజుల్లో నిరూపించుకోలేకపోతే దోచుకుంటారా?’ అని ప్రశ్నించారు.

Similar News

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.

News March 19, 2026

పంచాంగ పఠనం.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందన్న మాడుగుల

image

AP: ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని వివరించారు.

News March 19, 2026

PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

image

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.