News May 3, 2024
14 సెగ్మెంట్లు సమస్యాత్మకం.. అక్కడ 100% వెబ్‌కాస్టింగ్

AP: రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలు సమస్యాత్మకమైనవిగా సీఈవో ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. వాటిలో పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల, ఒంగోలు, ఆళ్లగడ్డ, చంద్రగిరి, తిరుపతి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌తో భారీగా CAPF బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 8, 2025
USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

AI, ఆటోమేషన్, ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్‌కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్‌లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.
News November 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు
News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>


