News February 26, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News February 27, 2026
APPLY NOW: డిగ్రీ అర్హతతో 650 పోస్టులు

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ అర్హత గలవారు మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450+GST, SC,ST, PwBDలకు రూ.50+GST. వెబ్‌సైట్: https://rbi.org.in./
News February 27, 2026
వరి పంటకు ఎక్కువగా యూరియా వేస్తున్నారా?

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
News February 27, 2026
‘స్థానిక’ ఎన్నికలపై హైకోర్టులో పిల్

AP: 13,325 పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం, SECని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎన్నికలకు ముందు BC జనాభా లెక్కింపునకు డెడికేషన్ కమిటీని ఏర్పాటుచేయాల్సి ఉందని AG శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలుకు సమయం కోరగా న్యాయస్థానం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కాగా పంచాయతీలకు APR 2, పురపాలికలకు MAR 17తో కాలపరిమితి ముగుస్తుంది.


