News February 26, 2026
మార్చి 14న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

మార్చి 14న పిడుగురాళ్లలోని సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ కోర్టు జడ్జి టి.ప్రవళిక బుధవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ పడవలసిన కేసులు, చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
Similar News
News February 27, 2026
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్‌సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.
News February 27, 2026
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్‌లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News February 27, 2026
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.


