News February 26, 2026
నల్గొండ: రూ.43 కోట్ల ధాన్యం కుంభకోణం.. దంపతుల అరెస్ట్

ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ఖజానాకు రూ.43 కోట్లు గండికొట్టిన కిలాడీల గుట్టును నల్గొండ పోలీసులు రట్టు చేశారు. కస్టమ్ మిల్లింగ్ పేరుతో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కందుకూరి మహేందర్ దంపతులను అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News March 1, 2026
సండేను ఫండేగా మార్చుకోండి

వారమంతా బిజీగా గడిపిన చాలా మందికి సండే అంటే రెస్ట్‌డే. ఎక్కువసేపు నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఆదివారాన్ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంతో సమయం గడపడం, బుక్ రీడింగ్, వాకింగ్, గదిని సర్దుకోవడం, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం వంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు. దీంతో పాటు వచ్చేవారంలో చేయాల్సిన పనులపై ప్లాన్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
News March 1, 2026
ఇరాన్‌పై అమెరికా దాడులకు అదే కారణమా?

ఓవైపు చర్చలు కొనసాగుతుండగా సడన్‌గా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇరాన్ వైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరాన్ మొదట నుంచి న్యూక్లియర్ అగ్రిమెంట్ చర్చలపై నిజాయితీగా లేదని US అధికారులు చెబుతున్నారు. పౌరుల అవసరాల కోసం ఉచితంగా న్యూక్లియర్ ఫ్యూయెల్ అందిస్తామన్నా ఇరాన్ యురేనియమ్‌పై పట్టుబట్టిందని తెలిపారు.
News March 1, 2026
43 మందికి రూ.4.30 లక్షల జరిమానా: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని విజయనగరం ఎస్పీ వెల్లడించారు.


