News February 26, 2026

పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

image

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.

Similar News

News March 1, 2026

చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

image

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2026

36ఏళ్లు ఇరాన్‌ను శాసించిన సుప్రీంలీడర్ – 1/2

image

ఇరాన్‌ను 36ఏళ్లు తన ఉక్కుపిడికిలితో పాలించిన నియంత అలీ ఖమేనీ. 1939లో ఇరాన్‌లోని మషహద్‌లో ఓ పేద కుటుంబంలో ఖమేనీ జన్మించారు. ఇస్లామిక్ తిరుగుబాటు నాయకుడు ఖొమైనీకి శిష్యుడిగా మారి ఇరాన్ షా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఖమేనీ ముఖ్యపాత్ర పోషించారు. తన గురువు ఖొమైనీ నాయకత్వంలో 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ రూల్ స్థాపించగలిగారు. 1980-88 మధ్య ఇరాక్‌తో ఎనిమిదేళ్లు యుద్ధం సాగినా ఇరాన్ పట్టు‌ను సడలనివ్వలేదు.

News March 1, 2026

36ఏళ్లు ఇరాన్‌ను శాసించిన సుప్రీంలీడర్ – 2/2

image

1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఆయతొల్లా రుహోల్లా ఖొమైనీ చనిపోయాక ఖమేనీ పగ్గాలు అందుకున్నారు. సుప్రీంలీడర్ హోదా కోసం రాజ్యాంగాన్ని మార్పించారు. US సహా విదేశాల ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగినా పట్టువీడలేదు. నిరసనలు చెలరేగితే నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేసేవారు. హెజ్బొల్లా, హౌతీ వంటి మిలిటెంట్ సంస్థలను పోషించి మిడిల్‌ఈస్ట్‌ను శాసించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ తర్వాత ఎవరు అనేది చర్చనీయాంశమైంది.