News February 26, 2026
మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్‌పై అమెరికా దాడి: ఒవైసీ

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.
Similar News
News March 3, 2026
భారత్ చేరుకున్న పీవీ సింధు

యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. సింధుతో పాటు మరికొంత మంది ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తిరిగి స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని సింధు ట్వీట్ చేశారు. ఇందుకు సహకరించిన UAE అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి థాంక్స్ చెప్పారు.
News March 3, 2026
కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి KP ఉన్నికృష్ణన్ (89) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళలో తుదిశ్వాస విడిచారు. 1971 నుంచి 1996 వరకు వడకర MPగా ప్రాతినిధ్యం వహించిన ఆయన VP సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1990 గల్ఫ్ యుద్ధ సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను రహస్యంగా కలిశారు. ప్రాణాలకు తెగించి మరీ 1.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
News March 3, 2026
ఖమేనీ హత్యపై మౌనం బాధ్యతారాహిత్యం: సోనియా గాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుబట్టారు. ఇది ‘న్యూట్రల్’గా ఉండడం కాదని, విదేశాంగ విధానంలో ‘బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను చంపడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై భారత్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.


