News May 3, 2024

50 కోట్ల మార్కును దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య

image

TG: హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని, మెట్రో ట్రైన్స్ వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. రోజూ 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండో దశ మెట్రో రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.

Similar News

News December 28, 2024

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా: అభిమాని

image

రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.

News December 28, 2024

నటి కారు బీభత్సం.. ఒకరు మృతి

image

మరాఠి నటి ఊర్మిల కోఠారె ప్రయాణిస్తున్న కారు ముంబైలో బీభత్సం సృష్టించింది. మెట్రో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులపైకి ఆమె కారు దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్, నటి ఊర్మిలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

News December 28, 2024

రోహిత్ ఓ విఫల కెప్టెన్, బ్యాటర్: MSK ప్రసాద్

image

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్‌ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.