News February 26, 2026
మెదక్: హత్య కేసు నిందితుడి సూసైడ్

హవేలిఘనపూర్ మండలం గంగాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని చాకలి గోపాల్(48) మృతి చెందాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో అదే గ్రామానికి చెందిన తల్లి, కుమారుడి హత్య కేసులో గోపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గోపాల్ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
GNT: విషాదం.. పిల్లలకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి దుర్మరణం

తెనాలిలోని పినపాడు మద్రాస్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కరేటి సురేశ్ (45) తన పిల్లల కోసం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళానికి గురైన సురేశ్‌ను ఒకటో నెంబర్ ట్రాక్‌పై వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 1, 2026
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా నమోదైంది.


