News May 3, 2024

రేపు నెల్లూరుకు సీఎం జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్లో దిగుతారు. అనంతరం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం 3.50 నుంచి 4.35 వరకు బహిరంగ సభ ఉంటుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కోరారు.

Similar News

News March 12, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News March 11, 2026

NLR: సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. వాస్తవం ఇదే.!

image

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని సంబంధిత శాఖ అధికారిని లీలారాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అధీకృత LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిలిండర్ల కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.