News February 26, 2026
గుంటూరు: ఆ ముగ్గురు DSPలకు షాక్..!

ఏపీలో 2018 గ్రూప్-1 సెలక్షన్‌కు సంబంధించి అవకతవకలు, అక్రమాలు జరిగాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న గుంటూరు వెస్ట్ DSP అరవింద్, సౌత్ DSP బానోదయ, గురజాల DSP జగదీశ్ ఉన్నారు. వీరిని వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News March 1, 2026
GDK: స్టేషన్‌లో పార్కింగ్ ఏంటని బైక్‌పై ప్రతాపం చూపించిన పోలీస్ అధికారి

RMG పోలీస్ కమిషనరేట్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుకు సంబంధించిన బైక్‌ను ఓ పోలీస్ అధికారి శనివారం ధ్వంసంచేశారు. అ ఠాణాలో రోజు పార్కింగ్ చేసి PDPLకి నిత్యం విధులు నిర్వహించేందుకు హోంగార్డు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పార్కింగ్ ఏంటని కోపగించుకున్న సదరు పోలీస్ అధికారి ఏకంగా బైక్‌పై తన ప్రతాపాన్ని చూపించారు. ఇష్టానుసారంగా పగలగొట్టి కసి తీర్చుకున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.
News March 1, 2026
NTR: హైకోర్టు గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపన చేసిన CJI

అమరావతి హైకోర్టు సమీపంలో 6,300 చదరపు గజాల స్థలంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ పనులకు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైట్‌లో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలసి CJI పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 50,000 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో G+3 తరహాలో అధికారులు CRDA ఈ గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు.
News March 1, 2026
నారయణపేటలో రేపే మెగా జాబ్ మేళా

నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెంనర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఉదయాన్నే కళాశాలకు హాజరు కావాలన్నారు.


