News February 26, 2026
గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.
Similar News
News March 3, 2026
ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.
News March 3, 2026
సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.
News March 3, 2026
బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా భారత్

వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న దేశంగా భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారత్ 55.035 స్కోర్‌తో 54 ర్యాంక్ సాధించింది. చైనా (85) కంటే మెరుగైన స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనూ మనమే టాప్. కాస్ట్ ఆఫ్ లివింగ్, మార్కెట్ సైజ్, లేబర్ చట్టాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇక టాప్-3లో అమెరికా, సింగపూర్, యూకే ఉన్నాయి.


