News February 26, 2026
తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.
News February 28, 2026
పాతకక్షల భగ్గు: భీమవరంలో దారుణ హత్య

2022 డిసెంబరులో రఘు సోదరుడు ఏసు హత్యతో రెండు వర్గాల మధ్య కక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 17న గోవింద్, తన సోదరుడు విజయ్‌తో కలిసి భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా.. గొల్లవానితిప్ప రోడ్డులోని కనకదుర్గ ఆలయం వద్ద రఘు తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు.
News February 28, 2026
భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.


