News February 26, 2026

తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి స్విమ్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. svimstpt.ap.nic.in వెబ్‌సైట్ చూడాలి. ఈనెల 19 నుంచే ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.

Similar News

News March 1, 2026

గ్రేటర్‌ వరంగల్‌పై వారసుల గురి!

image

త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై నేతల వారసులు కన్నేశారు. ఈసారి మేయర్ సీటు జనరల్‌కు రిజర్వు కావడంతో, మాజీ ఎమ్మెల్యేలు గురిపెట్టి ఉండగా.. కొందరు నేతల కుమారులు, కుమార్తెలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో దాస్యం అభినవ్ భాస్కర్, విష్ణువర్థన్ రెడ్డి, బస్వరాజు శ్రీమాన్, కొండా సుష్మితా పటేల్, ఆరూరి విశాల్, దిలీప్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

News March 1, 2026

కడప జిల్లాలో కీలక పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన.!

image

కడపలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్‌రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థానంలో పులివెందుల RDO చిన్నయ్య, కడప RDO జాన్ స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు అదనపు బాధ్యతలు(FAC) అప్పగించారు.

News March 1, 2026

పాలమూరు: అంతరాలు లేని రేపటి కోసం..!

image

కుమ్మెర ఘటనలో 2 నెలల పసికందు మృతి సామాజిక వివక్ష ఎంతటి విషాదాన్ని మిగిల్చగలదో కళ్లకు కట్టింది. నేడు ‘Zero Discrimination Day’ సందర్భాన కులమతాల కంచెలు చెరిపేసి మనుషులమంతా ఒక్కటేనని చాటాల్సిన బాధ్యత మనపై ఉంది. పాప ప్రాణం బలి తీసుకున్న ఆ చేదు జ్ఞాపకం.. సమాజంలో ఇంకా వేళ్లూనుకున్న వివక్షకు నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, తోటి మనిషిని గౌరవించే ‘మానవత్వం’ అనే సంస్కారం అలవడినప్పుడే ఇలాంటి ఘోరాలు ఆగుతాయి.