News February 26, 2026

నేడు ఖమ్మంలో టెన్షన్.. టెన్షన్..!

image

ఖమ్మం వెలుగుమట్లలో రూ.250 కోట్ల విలువైన 31.07 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 600ఇళ్లు తొలగించడంతో రోడ్డున పడ్డ బాధితులకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పేదలకు 2BHKఇళ్లు కేటాయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పేదలను మోసం చేసి, భూములు అమ్మిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. BRS నేత KTR నేడు బాధితుల పరామర్శకు రానుండడంతో టెన్షన్ నెలకొంది.

Similar News

News March 6, 2026

NZB: ఐక్యంగా ముందుకు సాగి జిల్లాకు మంచి పేరు తేవాలి: CP

image

అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో CP పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. టౌన్ CI శ్రీనివాస్ రాజ్ పాల్గొన్నారు.

News March 6, 2026

ఏప్రిల్ 6 నుంచి 11 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు: భూపాలపల్లి కలెక్టర్

image

ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు రోడ్డు భద్రత alive-arrive అనే థీమ్ తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రక్షణాత్మక డ్రైవింగ్ ప్రచారాలు, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ డ్రైవ్లు, గ్రామ రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, సమారిటన్ గుర్తింపు కార్యక్రమాలు చేపట్టబడతాయని అన్నారు. అలాగే ఓఆర్ఆర్, హైవేలపై భారీ వాహనాల అనధికార పార్కింగ్‌ను నివారించే చర్యలు తీసుకోవాలన్నారు.

News March 6, 2026

భద్రాద్రి: శుక్రవారం 170 మంది విద్యార్థులు గైర్హాజరు

image

భద్రాద్రి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 7,605 మంది విద్యార్థులు కేటాయించగా, 7,435 మంది హాజరయ్యారు, 170 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగినట్లు ఆయన తెలిపారు.