News February 26, 2026
తెలంగాణలో స్వీపర్ జీతం రూ.2లక్షలు

అవును మీరు విన్నది నిజమే. తెలంగాణలో విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2లక్షల వరకూ ఉందని CS రామకృష్ణారావు తెలిపారు. వరుస PRCల వల్లే జీతం ఇంతగా పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిన్న జరిగిన రివ్యూ మీటింగ్‌లో వెల్లడించారు. 2014లో ఇది కేవలం ₹1,500 కోట్లుగా ఉండేదని వివరించారు.
Similar News
News March 5, 2026
సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.
News March 5, 2026
లోన్‌పై బండి కొన్నారా? ఆ ఇబ్బంది ఉండదిక!

లోన్‌పై వెహికల్ తీసుకుంటే ఉండే హైపోథికేషన్ మార్క్ తొలగింపు ఇక ఈజీ కానుంది. రుణ చెల్లింపు పూర్తయితే RTOకు ఆన్‌లైన్లో బ్యాంకులు సమాచారం అందిస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యే ఫీచర్‌ను కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. SBI, 5 NBFCలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని త్వరలో అన్ని బ్యాంకులకూ విస్తరించనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే నో డ్యూ కాపీలు RTO ఆఫీసులకు వెళ్లి ఇస్తే ఇది పోతుంది.
News March 5, 2026
హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్‌లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.


