News February 26, 2026
పోలవరం: ఆవులపై దాడి చేసిన పెద్దపులి?

పోలవరం జిల్లాలో పులి సంచారం కలవర పెడుతోంది. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రజలకు పులి తారస పడడంతో బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Similar News
News March 4, 2026
అరకు రానున్న వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం 10.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అరకు బయలుదేరుతారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో రాణా ప్రతాప్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ నివాసానికి వెళ్లి, ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు, కోడలిని ఆశీర్వదిస్తారు.
News March 4, 2026
MBNR: ఖతర్‌లో చిక్కుకున్న డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి

గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయం కావడంతో కెనాడ నుంచి ఇండియాకు బయలుదేరాడు. అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఖతార్‌లో చిక్కుకుపోయాడు. దీంతో ఇంట్లో మార్చి 1న జరగాల్సిన ప్రీ వెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా వేశారు. కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
News March 4, 2026
MHBD: స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి నేడే చివరి తేదీ

క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేది అని మహబూబాబాద్ జిల్లా క్రీడాధికారిని ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ నెల 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలన్నారు.


