News February 26, 2026

BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

Similar News

News March 11, 2026

మోదీ పాలనలో క్యూలే మిగిలాయి: కాంగ్రెస్

image

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ హయాంలో దేశ ప్రజలు నిరంతరం లైన్లలోనే గడపాల్సి వస్తోందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 2016 నోట్ల రద్దు సమయంలో ATMల వద్ద పడ్డ కష్టాలు, కరోనా సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కోసం, ప్రస్తుతం వంట గ్యాస్ (LPG) కోసం క్యూ కట్టడాన్ని ఎత్తిచూపింది. మోదీ పాలనలో కేవలం క్యూలే మిగిలాయని సెటైరికల్ ట్వీట్ చేసింది.

News March 11, 2026

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

image

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మరోసారి దాడి చేసింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్‌పోర్టులో ఉన్న భారతీయుడు సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విమానాశ్రయం నుంచి భారీగా పొగ వెలువడుతోంది. మరోవైపు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. తమపై దాడి చేస్తున్న US-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.

News March 11, 2026

వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

image

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.