News May 3, 2024
శ్రీకాకుళం: హింసకు తావు లేని ఎన్నికలే లక్ష్యం

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు సీనియర్ అధికారి శేఖర్ విద్యార్థి హాజరయ్యారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.
News July 7, 2025
శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
News July 7, 2025
నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.