News May 3, 2024
పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటనలో మార్పులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 5న పవన్ ఉదయం 10 గంటలకు, హెలికాప్టర్‌లో పొన్నూరులోని సజ్జ ఫంక్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఐలాండ్ సెంటర్‌లో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద 11 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటలకు పవన్ తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News April 21, 2025
గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.
News April 21, 2025
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వినుకొండలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.