News February 26, 2026
పింఛన్ల పెంపుపై BIG UPDATE

TG: చేయూత పింఛన్లను తొలుత రూ.500 పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు ₹2,016, దివ్యాంగులకు ₹4,016 చొప్పున ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి నెలా ₹950కోట్ల వరకు ఖర్చవుతోంది. ₹500 పెంచితే ఏటా ₹2,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికల నాటికి దశలవారీగా పింఛన్లను ₹4వేలు, ₹6వేలకు పెంచాలని యోచిస్తోంది.
Similar News
News February 26, 2026
‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే

‘ది కేరళ స్టోరీ-2’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఇందులో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది. మూవీ చూడకుండానే CBFC సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల క్రితం HC విచారణ జరిపింది. తాము సినిమా చూశాకే నిర్ణయం చెబుతామని తెలిపింది. ఈక్రమంలోనే సినిమా చూసి స్టే ఇచ్చింది.
News February 26, 2026
రేపటి వరకు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో ఇవాళ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 26, 2026
37 రాజ్యసభ స్థానాలు.. నామినేషన్లు షురూ

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 5. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మార్చి 16న 9AM నుంచి 5PM వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్ర-7, TN-6, బిహార్-5, బెంగాల్-5, ఒడిశా-4, అస్సాం-3, <<19214239>>TG-2<<>>, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్-ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.


