News February 26, 2026
సిరిసిల్ల: అదనపు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో తొలి రోజు నుంచి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గరీమా అగ్రవాల్ ఇదే జిల్లాకు కలెక్టర్ కావడం విశేషం. 2025 అక్టోబర్ 23న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆమె.. అప్పటి కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లడంతో 4 నెలలుగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమితులయ్యారు.
Similar News
News February 27, 2026
సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్.. మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్!

జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో యంత్రాంగం కొరడా ఝుళిపించింది. సుమారు 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేసిన నలుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. బకాయిల రికవరీకి ‘ఆర్ఆర్ యాక్ట్’ అమలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత, నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు చేపట్టారు.
News February 27, 2026
ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.
News February 27, 2026
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్‌సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.


