News February 26, 2026
సిరిసిల్ల: ఖాళీగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టు ఖాళీగా మిగిలింది. గత అక్టోబరు నెలలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా నియమితులైన గరీమా అగ్రవాల్.. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఏఎస్ అధికారుల తాజా బదిలీలలో ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టులో ఎవరినీ నియమించకపోవడంతో ఆ పోస్టు ఖాళీగా మిగిలిపోయింది.
Similar News
News March 1, 2026
పాలమూరు: రైలు ప్రయాణికులకు అలెర్ట్.. పలు సర్వీసులు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ-కర్నూలు సిటీ (17435), కాచిగూడ-రాయచూరు (67787) రైళ్లతో పాటు, కర్నూలు సిటీ-కాచిగూడ (17436) రైలును మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
News March 1, 2026
HYD: పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్!

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.
News March 1, 2026
TODAY HEADLINES

☛ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత
☛ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు.. విమాన సర్వీసులు నిలిపివేత
☛ కాకినాడ(D) బాణసంచా పేలుడు ఘటనలో 20 మంది మృతి.. రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన CBN
☛ MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: రేవంత్
☛ దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
☛ T20 WC నుంచి PAK ఔట్.. సెమీస్‌కు NZ


