News February 26, 2026
గద్వాల్ జిల్లా DROగా పద్మజ రాణి

జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు DRO గా పద్మజ రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదే విధంగా జిల్లాలో ఆర్డీవో బాధ్యతలో ఉన్న ఉన్న అలివేలును హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న టి.శ్రీనివాస్ రావును జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖ అధికారిగా బదిలీ చేశారు.
Similar News
News February 27, 2026
రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌పై ప్రయాణించే వ్యక్తి పేరును మార్చుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది. మీ టికెట్‌ను మీ నాన్న, అమ్మ, బ్రదర్, సిస్టర్, కొడుకు, కూతురు లేదా భార్యాభర్తల పేరు మీదకు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రయాణానికి 24 గంటల ముందే టికెట్, ID ప్రూఫ్‌తో రిజర్వేషన్ ఆఫీసర్‌ను కలవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్, పెళ్లి బృందాలకు కూడా ఈ ఛాన్స్ ఉంది. ఈ మార్పు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది.
News February 27, 2026
పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష: అల్లూరి ఎస్పీ

జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుడు పాంగి రమేశ్ అలియాస్ పోయి రమేశ్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గురువారం ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలను వెల్లడించారు. నిందితుడికి శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన జీకేవీధి పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
News February 27, 2026
అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.


