News February 26, 2026

కల్వకుర్తి: మార్చి 1న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

image

మార్చి 1న కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. అండర్-14, అండర్-20, క్రీడాకారులకు 100, 200 మీటర్ల పరుగు పందెం క్రీడలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే విద్యార్థులు పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Similar News

News February 28, 2026

INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

T20WC S-8లో రేపు కోల్‌కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను బాలెన్స్‌డ్‌గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్‌పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్‌ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.

News February 28, 2026

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

image

ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబిలో జరిగిన దాడుల్లో పాకిస్థాన్ పౌరుడొకరు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారని, ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

News February 28, 2026

ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

image

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.