News February 26, 2026

జగిత్యాల: మున్సిపల్ కొత్త ఛైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరణ

image

జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల బలోపేతానికి కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

కోదాడలో ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’..!

image

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ కోదాడలో సంచలనం సృష్టిస్తోంది. బైనాన్స్ యాప్ ద్వారా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న 16 మందిపై కేసులు నమోదయ్యాయి. కోదాడ, పరిసర మండలాల నుంచి మొత్తం 116 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

News March 1, 2026

NLG: సెగలు పుట్టిస్తున్న భానుడు

image

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. సాధారణంగా మార్చిలో ఉండే ఎండలు ఫిబ్రవరి చివరి వారంలోనే కనిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2026

సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.