News May 3, 2024
రూ. 11.67 లక్షల చెవిదిద్దులు.. రూ. 1167కే సొంతం!

రూ.11.67 లక్షల విలువైన వజ్రాల చెవిదిద్దులవి. కార్టియర్ వెబ్‌సైట్లో గ్లిచ్ కారణంగా మెక్సికోకు చెందిన రోజిలియో అనే వ్యక్తికి రూ. 1167కే దక్కాయి. ధర తక్కువ కదా అని 2 జతలు ఆర్డర్ పెట్టాడు. విషయం అర్థమైన సదరు సంస్థ వెబ్‌సైట్‌లో రేటు మార్చింది. వాటిని అమ్మేందుకు నిరాకరించింది. దీంతో వినియోగదారుల కోర్టుకు వెళ్లి మరీ రోజిలియో వాటిని దక్కించుకున్నాడు. చిన్న తప్పునకు సంస్థ పెద్ద మూల్యం చెల్లించక తప్పలేదు.
Similar News
News March 18, 2026
24 గంటల్లోనే అణుబాంబు వేసేవారు: ట్రంప్

ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని పేర్కొన్నారు. ఇది కేవలం పశ్చిమాసియాలోనే గాక యూరప్ వరకు పాకి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ <<19409994>>రాజీనామాపై<<>> స్పందిస్తూ.. భద్రతాపరమైన విషయంలో ఆయన చాలా వీక్ అని, వెళ్లిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.
News March 17, 2026
IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.
News March 17, 2026
EAPCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు

AP EAPCET దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24వ తేదీ వరకూ <


