News February 26, 2026
మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.
Similar News
News February 28, 2026
మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.
News February 28, 2026
మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.
News February 28, 2026
మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.


