News February 26, 2026

731 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>హిందుస్థాన్ <<>>పెట్రోలియం కార్పొరేషన్ 731 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, BE/BTech, MBA, CA/CMA, MSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, CBT/రాత పరీక్ష/ టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustanpetroleum.com

Similar News

News March 2, 2026

రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాలివ్వండి: కవిత

image

INC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనపై జాగృతి చీఫ్ కవిత విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ జీ దో లాక్ నౌకరీ దో’ అంటూ ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న నిరుద్యోగుల గోడు పట్టదా? యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తాలేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు’ అని విమర్శించారు.

News March 2, 2026

వార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

image

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వార్ ఎఫెక్ట్‌తో ఈరోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎటర్నల్, L&T, ఏషియన్ పేయింట్స్ షేర్లూ నష్టాల్లో ఉన్నాయి.

News March 2, 2026

తిరుపతిలోని SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (<>SVIMS<<>>) 26 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి MBBS, BDS, BSc(నర్సింగ్, రేడియోగ్రఫీ), ANM, CVT, MIT, PG డిప్లొమా, PG(సోషల్ వర్క్), టెన్త్, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. సైట్: svimstpt.ap.nic.in