News February 26, 2026

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్

image

మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ పి. పరమేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లాలో దాచేపల్లి, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట స్కూళ్లల్లో ప్రవేశ అర్హులైన అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News February 28, 2026

HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

image

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.

News February 28, 2026

సంగారెడ్డి: పెండింగ్ కేసులపై ఎస్పీ స్పెషల్ యాక్షన్ ప్లాన్!

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యత పెంచి, కేసులను త్వరగా కొలిక్కి తీసుకురావాలని స్పష్టం చేశారు.

News February 28, 2026

కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బోటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.