News February 26, 2026
సిరిసిల్ల: మైనార్టీ టూవీలర్ దరఖాస్తుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని మైనార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ టూవీలర్ మోపెట్ పథకం దరఖాస్తుల పరిశీలన గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సలీం, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మహమ్మద్ హమీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి షబ్బీర్, ఉపాధ్యక్షుడు హైదర్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు అనీఫ్ భావన్, చాంద్ మియా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 27, 2026
MLA శ్రీధర్ స్థానంలోకి కొత్త వ్యక్తి.?

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నివేదిక ఇవ్వలేదు, చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు వీడియోలు విడుదల చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వారికి ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
News February 27, 2026
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


