News May 3, 2024

భగ్గుమన్న పాలమూరు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గద్వాలలో 45.7, నారాయణపేట 45.2, మహబూబ్‌నగర్‌లో 45.1, వనపర్తిలో 44.8 డిగ్రీలు రికార్డు అయింది. వచ్చే 3రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మ‌ధ్యాహ్నం సమయంలో బ‌య‌ట‌కు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

Similar News

News January 5, 2026

MBNR: 87126 59360.. SAVE చేసుకోండి

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.

News January 5, 2026

మహబూబ్‌నగర్‌లో భూ ప్రకంపనల కలకలం..?

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సమీప కాలనీల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా లేక బ్లాస్టింగ్ వల్ల జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

News January 5, 2026

MBNR: 6, 7న జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడలు

image

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి క్రీడలు డిఈఓ ఆదేశాల మేరకు బాల, బాలికలకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్జిఎఫ్ (SGF) కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 6, 7న జిల్లాస్థాయి క్రీడలు నిర్వహిస్తామని, క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్ విత్ పెన్ నెంబర్ తో మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్‌లో ఉదయం 9:00 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. SHARE IT.